పతనం
మధుర గాయాల వేణువునై
కోటిరాగాల జననినై
జీవిస్తున్నానని వెదురు....
వేయితలలను సైతం వినయంగా వంచి
వేలాదిజీవుల ఆకలితీరుస్తున్నానని వరిపైరు
తృప్తిగా తనువుచాలిస్తున్నాయి.
కానీ నేను...
గమ్యం వుండీ గమనం లేక
విజ్ఞానంవుండీ జ్ఞానంలేక
మనిషినైవుండీ మానవత్వంలేక
పతనమైపోతున్నాను
నిను చేరకముందే
భావం భాషగ మారకముందే
మనసు మూగబోయింది
మోడు చిగురులు వేయక ముందే
వసంతం వెళ్ళిపోయింది
కల కన్ను తెరవక ముందే
కరిగి కన్నీరైపోయింది
నా దారి నిను చేరకముందే
గమ్యం మారిపోయింది
నా పయనం ఆగిపోయింది
మరచిపోకు నేస్తమా...
నీ పరిచయం పంచిన ఆనందం
అనుభూతులుగా మార్ఛి
గుండెల్లో దొంతర్లుగా పేర్చి
నాతోపాటు తీసుకెళుతున్నాను
ఈ దూరం మన స్నేహాన్ని దూరం చెయ్యదు కదా?
ఈ కాలం మన అనుభూతులని మరుగుపరచదు కదా?
తిరిగొఛ్ఛిన నన్ను నీ స్నేహం నువ్వెవరని గేలి చేయదు కదా
కలలు కన్న తీరాన్ని చేరుతూ
ఇక్కడి అనుబంధాన్ని మరువనని
మాటిస్తున్నాను నేస్తం... మరి...నువ్వు???
లాస్యం
అధర కాగితాలపై విరిసే
సుమధుర కవిత
మనసుల్ని దోచే
హిమ వీచిక
మృదు మధుర దరహాసిక
ఓ సుందర జ్ఞాపిక
కలతల్ని మరిపించి మురిపించే
అనిర్వచనీయ కానుక
మాట రాని మనసులకు పలుకు నేర్పే
లిపిలేని భావమిదే ఇక.
నీకోసం
శూన్యంలో సైతం వెతుకుతున్నా
ఊహకందని నీ రూపుకోసం
నిను వర్ణించడానికి అందమైన భాషకోసం
గాలినై పయనిస్తున్నా
అంతుచిక్కని నీజాడ కోసం
వెచ్చనైన నీ స్పర్శ కోసం ప్రియా ...
ఎప్పుడు కనిపిస్తావు?
నీ అనురాగంలో ఎప్పుడు ముంచేస్తావు?
నీపై
సఖుడా
నీ రూపు నా కనులలో మెదులుతుండగా
భావావేశాలకు అతీతంగా
నీ మీద కలిగే ఆ భావనే
నీవు నాకెంతో ప్రత్యేకం అని తెలియచేస్తూవుంటుంది
నీ స్నేహాన్ని పొందమని
మనసు తొందర పెడుతూవుంటుంది
మరపు
ప్రతి నవ్వులో నీ మాట వింటూ
ప్రతి మోములో నీ రూపు కంటూ
ప్రతి అనుభూతిలో నీ ఆనవాళ్ళంటూ
చదివే ప్రతి పుటలో నువ్వున్నావంటూ ఇలా బ్రతికేస్తున్నానంతే...
ఎంత బాగుందీ ఊహ ..
నిజానికి ఎదీ నువ్వెక్కడున్నావు?
నువ్వొక జ్ఞాపకమంతే
గుర్తు చేసుకుంటే గుర్తొస్తావు
అదొక అనుభూతి అంతే
వద్దనుకుంటే మర్ఛిపోగలను.........
మర్ఛిపోయాను
నువ్వు లేకపోయినా
అనుకోకుండా కలిసి
అడగకుండా యదలో చేరి
ఆశలు రేపి ఆశయం చూపి
మనిషిని చేసి
మనసుని దోచి
మదిలో నిలిచిన ఆమె నన్నొదిలి వెళితే..
నేను జీవించగలనా?
జీవించినా ఆమె జ్ఞాపకాలతో మామూలుగా మనగలనా?
అనుకొన్నా!
ఇది మూడేళ్ళ క్రితం మాట
కాని ఇంతలోనే బ్రతికేస్తున్నా
ఆమె జ్ఞాపకాలు మచ్చుకి సైతం లేకుండా
Tuesday, August 31, 2010
స్నేహ0
ఈ స్నేహ0..ఈ ఆన0ద0
శాశ్వత మవుతాయనుకున్నాను
ఇలా నా జీవిత0
స్నేహితులతోవస0త0 లో
పున్నమి వెన్నెల రేయి లాగడిఛిపోతు0దనుకున్నాను
అదేమిటో...కాలానికి స్నేహ0 పై తగని కక్షేమో
చిరునవ్వులు ఛిన్న0 చేసే0దుకు
త్వరత్వరగా ము0దుకు కదిలిపోతు0ది
స0వత్స్టరాలని క్షనాలలా కరిగి0చేస్తు0ది
విడిపోక తప్పదని గుర్తుచేస్తు0ది
స్నేహమా....గమ్య0 నీవవుతావనుకున్నాను
కానీ మజిలీ చేసి వెలుతున్నాను
.............................................
ఎవరు ఎవరికి ఏమి కాము
అయినా అ0దరు అ0దరికి అయినవాల్లయ్యాము
ఇపుడేమొ ఎవరికి ఎమి కానివాల్లలా
ఎవరి దారి వాల్లు చూసుకున్నాము
......................................................
ఒ0టరిగా కూర్చుని శూన్య0 లోకి చూస్తున్నాను......
ఆ శూన్యాన్ని మనసులో వు0చుకుని
ఎక్కడోవు0ది అ0టున్న నేను
ఎ0త పిఛ్ఛిదానిని క
నులము0దే మసకబారిపోతున్న వ్యక్తిత్వాన్ని
శిలలా చూస్తూఉ0డడ0తప్పి0చి
ఏమి చేయలెకపోతున్నాను .....సరిదిద్దే
నేస్త0 దరిలేక
వె0టాడే ఒ0టరితన0 ను0డి
పారిపోలేకపోతున్నాను ...చేయి వేసి
ఓదార్చే హస్త0 లేక
కోరుకునే ఏకా0తాన్నీ అ0దుకోలేకపోతున్నాను...
ఎ0దుక0టే .. అనుక్షన0 నీడగా తోడుగ ఆలోచనల్లో నా నేస్తాలు...
జ్నాపకాల లో నవ్వుల పూవులు పూయిస్తూ
శూన్యాన్ని సైత0 స0దడిగా మారుస్తూ..
పదహారు ప్రాయం
ఆశల రెక్కలపై
హద్దుల తీరాలను దాటి
అనంతాల ఆనందాలను కోరుతూ
కలల లోకంలో విహరిస్తూ
కవితాగానాలలో....స్నేహితుల సరాగాలలో
మధురానుభూతులు పొందుతూ
నిన్న జ్ఞాపకం గా
రేపు అద్భుతంగా
ఊహించేదే .......'పదహారు ప్రాయం'
పోగుపడిన భావాలు
నీకై తపిస్తున్న ఈ మనసు ఘొష వినలేవా?
నా కన్నుల మూగ భాష కనలేవా?
.....................................................
నీకన్నుల వెలుగు చాలు నా శ్వాశకి
నీ నవ్వుల మెరుపు చాలు ఈ జన్మకి
.....................................................
నీ దరి చేరలేకపోతున్న నా హ్రుదయ0
ఆవేదన మయ0
......................................................
కెరట0లా తాకావు నా హ్రుదయాన్ని
కలల వాకిళ్ళు గా మార్చావు నా కన్నుల్ని
......................................................
మనసు పొరలలో దాగిన
అనుభూతుల దొ0తరలను విడదీస్తూవు0టే
అన్నీ నీ తాలూకూ జ్నాపకాలే కనిపిస్తున్నాయి
అవి పెదవులపై నవ్వులై విరబూస్తున్నాయి
......................................................
చెమ్మగిల్లాయి కన్నులు
ఎన్నటికో కలుసుకున్న అన0ద0తతో
తడిని0డాయి అవే కన్నులు మరునిమిష0లో
విడిపోతున్న విషాద0తో
......................................................
నిను చూడగానే ఉప్పొ0గిన ఆన0దపు అల
ఎగసి0దలా..ఆ ని0గిని తాకి0దనిపి0చేలా
......................................................
అలుపెరుగని కెరట0 నా హ్రుదయ0
దిగ0తాలదాకా నా పయన0
......................................................
ప్రియా ...చెప్పాలని వు0ది నీ రూపు కవితగా
పాడాలని వు0ది నీ నవ్వు పాటగా
.....................................................
పలుకురాని నా హ్రుదయ0లో వెలికి రాని భావాలెన్నో....
.....................................................
మనసు0ది నాకు ప్రేమి0చడానికి
మనుషులేరి మనసివ్వడానికి
.....................................................
ఊహలకు దారినిచ్ఛేది ఒ0టరి తనమే
కవితలకు ప్రాణ మిఛ్ఛేది కమ్మని భావనే
....................................................
నీ ము0గురులు నా మోవిపై ఆటాడలేదని విలపి0చనా?
నీ మనసు పాట నాకు వినిపి0చనీయలేదని అలుకబూననా?
నీ నవ్వునై పెదవులపై తారాడనీయమని బ్రతిమలుకొనా?
కొన్ని ఆలోచనలు ఇలా...
నినుగూర్ఛిన కలలన్ని కరిగిపోయాయి
కన్నిరై చె0పలపై జారిపోయాయి
.....................................................
గు0డెలోని భావాల గొ0తు నొక్కొద్దు
కళ్ళలోనే సాగరాలు ఆపేయొద్దు
చిరునవ్వులు పెదవుల్లో దాచేయొద్దు
స్నేహాలను చేతులతో సరిపెట్టొద్దు
......................................................
తోడులేదని గాలితో కబుర0పగా
నడిరేయిలో వినువీధి లో
జాబిలై నను పలుకరి0చి0ది
వెన్నెలై తలను నిమిరి0ది
.......................................................
నా గతమ0తా చిరునవ్వుల చరిత
ఆమె వెళ్ళాకా..
నా బ్రతుక0తా ఓ విషాదా0త కవిత
........................................................
మేము ఎవరూ ఎవరికి ఏమి కాము
కాని
అ0దరు అ0దరికి అయినవాళ్ళయ్యాము [ఫ్రె0డ్స్]
మనసుపడితే
ఏ0చేస్తున్నా నీ జ్నాపకాలే
ఎటు ఛుస్తున్నా నీ ఆనవాల్లే
మనసా........మనసు పడితే దాగిపోతాయా ఊసులు
ఛెలరేగుతాయా ఆసలు
....................
శిశిర0 లొ వెన్నెల వేళల్లో
శిఖరాలను0డి జాలువారే
పూవుల జలపాత0 లా వు0ది ఆమె అ0ద0
ఎన్ని కన్నులకు వేసి0దో బ0ద0
పాప0! ఎన్ని హ్రుదయాలకు అయ్యి0దో గాయ0.........................
నీతోడుగా
స0దిటకు స్వాగతిస్తే
పరుగు పరుగున రానా?
చ0ద్రునికి సెలవు చెప్పే
మల్లె పూల మ0త్రమేయనా?
......................................................
పూస్తున్న పూవుల్లొ చూడు ..నేనున్నాను
పసిపాప నవ్వుల్లొ చూడు..నేనున్నాను
ఘల్లుమన్న మువ్వల్లొ చూడు..నేనున్నాను
ఝల్లుమన్న నీ గు0డెల్లొ చూడు...నేనున్నాను
అనుక్షన0 నీతోనే వున్నాను
ప్రతి క్షన0 నీతోడై వున్నాను...నీ నీడై వున్నాను
కల
ఆరాధకుని కనురెప్పల మాటున దాగి
కనువిందు చేసే ఆ కమనీయ దృశ్యం
హ్రుదయానికి ప్రేరణనిస్తే సుందర కావ్యం
కుంచెనుకదిలిస్తే ఓ అద్భుత చిత్రం
భావకుని మదిలో భావాల ఆ ప్రతిరూపం
ప్రక్రుతిలో అందాలకి అసలైన నిదర్శనం
ఆ క్షణ0
ఎన్నాల్లొ ఎదురుచూసిన తరుణ0
తరలి వఛ్ఛి0ది నా కోస0
తీసుకొఛ్ఛి0ది మదుమాస0
ఎన్నొ చెప్పాలనుకున్నాను ఆ క్షణ0
చెప్పలెక తడబడుతున్నాను ప్రతి అక్షర0
కానీమాటలన్ని మౌనాలైతనని పలకరి0చాయి
మది లోని భావాలన్ని నవ్వులై ఊసుల్ని తెలిపాయి
పట్టలేని ఉద్వేగ0 తో రెప్పలేమో వాలిపోయాయి
వలపులన్ని సిగ్గులై తలను వ0చేసాయి
పరదా మాటుగా ఒక్క మారు తనని చుద్దామనుకున్నను
అతని చూపులో నాచూపు కలసి
చెక్కిల్లు చిక్కబడి పోయాయి
ఆ మనసుతో ఈ మనసు చిక్కుబడి ముడిపడిపోయాయి
స్నేహ0
నూరేళ్ళు నిలిచే స్నేహం కావాలి
కన్నుల్లో నను దాచే నేస్తం కావాలి
గుండెల్లో ఒదిగిపోయేందుకు ప్రియుడు కావాలి
ఒకరికి సొంతమయ్యేందుకు నేను కావాలి
.........................................................
ఏ స్నేహం నాకొద్దు
ఏబంధం వేయొద్దు
స్నేహం కాలంతో చేజారిపోతుంటే
బంధం దూరంతో ముడివీడిపోతుంటే
ఏ సంతోషమయినా విషాదంగా మిగిలిపోతుంది
చిన్ని ఆనందం సైతం ఎండమావిలా మారిపోతుంది
అందుకే ఏ స్నేహం నాకొద్దు
ఏ బంధం వేయొద్దు
ప్రకృతి
వెన్నెల ధారల్లో స్నానమాడి
పొగమంచు చీర కట్టిన వనకన్యను
ఆర్ధ్రంగా తట్టి లేపింది ఏటివాలు కొండ గాలి
నిశి ముసుగు మాటున
కరి మబ్బు నీడనున్నఉషాకిరణుడికి
శుభోదయం పలికింది కోయిలమ్మల జోడి
వెఛ్ఛగ సూరీడే తాకగ
పలకరించిన పులకరింతతో పరవశంగా
ఒళ్ళువిరుచుకుంది వయ్యారి మయూరి
ఈ అందాలన్నీ ఒక్కచోట చేరి
ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి మనసుని తాకి
స్నేహ0
ఈ స్నేహ0..ఈ ఆన0ద0
శాశ్వత మవుతాయనుకున్నాను
ఇలా నా జీవిత0
స్నేహితులతోవస0త0 లో
పున్నమి వెన్నెల రేయి లాగడిఛిపోతు0దనుకున్నాను
అదేమిటో...కాలానికి స్నేహ0 పై తగని కక్షేమో
చిరునవ్వులు ఛిన్న0 చేసే0దుకు
త్వరత్వరగా ము0దుకు కదిలిపోతు0ది
స0వత్స్టరాలని క్షనాలలా కరిగి0చేస్తు0ది
విడిపోక తప్పదని గుర్తుచేస్తు0ది
స్నేహమా....గమ్య0 నీవవుతావనుకున్నాను
కానీ మజిలీ చేసి వెలుతున్నాను
.............................................
ఎవరు ఎవరికి ఏమి కాము
అయినా అ0దరు అ0దరికి అయినవాల్లయ్యాము
ఇపుడేమొ ఎవరికి ఎమి కానివాల్లలా
ఎవరి దారి వాల్లు చూసుకున్నాము
......................................................
ఒ0టరిగా కూర్చుని శూన్య0 లోకి చూస్తున్నాను......
ఆ శూన్యాన్ని మనసులో వు0చుకుని
ఎక్కడోవు0ది అ0టున్న నేను
ఎ0త పిఛ్ఛిదానిని క
నులము0దే మసకబారిపోతున్న వ్యక్తిత్వాన్ని
శిలలా చూస్తూఉ0డడ0తప్పి0చి
ఏమి చేయలెకపోతున్నాను .....సరిదిద్దే
నేస్త0 దరిలేక
వె0టాడే ఒ0టరితన0 ను0డి
పారిపోలేకపోతున్నాను ...చేయి వేసి
ఓదార్చే హస్త0 లేక
కోరుకునే ఏకా0తాన్నీ అ0దుకోలేకపోతున్నాను...
ఎ0దుక0టే .. అనుక్షన0 నీడగా తోడుగ ఆలోచనల్లో నా నేస్తాలు...
జ్నాపకాల లో నవ్వుల పూవులు పూయిస్తూ
శూన్యాన్ని సైత0 స0దడిగా మారుస్తూ..
నీకోసం
శూన్యంలో సైతం వెతుకుతున్నా
ఊహకందని నీ రూపుకోసం
నిను వర్ణించడానికి అందమైన భాషకోసం
గాలినై పయనిస్తున్నా
అంతుచిక్కని నీజాడ కోసం
వెచ్చనైన నీ స్పర్శ కోసం ప్రియా ...
ఎప్పుడు కనిపిస్తావు?
నీ అనురాగంలో ఎప్పుడు ముంచేస్తావు?
గతం
స్నేహితులతో సరదాలతో
విరబూసిన నవ్వులతో
చిలిపి తగాదాలతో
మది నిండే భావాలతో
కలసి నడచే సాయంత్రాలతో
కలలు కనే నడి రాత్రులతో
కలుసుకునే ఉదయాల కోసం ఎదురు చూపులతో.....
స్నేహం తోడుగా
కాలం సాక్షిగా
కరిగిపోయిన గతాన్ని
అప్పుడప్పుడు గుండె గుప్పిళ్ళ నుండి
జారవిడిచి అపురూపం గా తరచి చూసుకుంటూ
నిన్నని నేడుగా భావిస్తున్నాను
నేడు నిన్నలో జీవిస్తున్నాను
అయినా ఎందుకో .....ఇప్పుడిలా మరణించి
అప్పటి నాలా...మళ్ళా జన్మించాలనివుంది
......................................................................
......................................................................
గతం తలుపులు తెరుచుకుని
జ్ఞాపకాల వీధుల్లో
ఒంటరి పక్షి లా తిరుగుతున్నాను
అప్పటి స్నేహపూరిత హస్తాలను మళ్ళీ స్పృశిద్దామని
రేపటి లోకి ఆశ గా ఎదరు చూస్తున్నా...
ఒకప్పటి పసిదనం ఛాయలు మఛ్చుకైనా
రాకపోతాయా అని..
నిజానికి..
రేపటి పై ఆశ లేదు
నిన్నటి ని చేరాలని ఆరాటం తప్ప
నేటి గురించి ఆలోచన లేదు
అప్పటి అనుభూతుల నెమరివేత తప్ప
ఆశలు
ఓ చినుకునై ఈ నేల చేరి
పొత్తిళ్ళలో పైరు పిల్లలనెత్తాలని
ఆ గాలినై ప్రతి పూవు తాకి
నిత్య సుగంధాలు వెదజల్లాలని
ఓ భావనై ప్రతి మది ని దాగి
యద తలుపులు తడుతూ ఉండాలని
ఒక భావమై కలములో దూరి
కమ్మని కవితామృతం చల్లాలని
చిన్నారి పెదవినై ప్రతి బుగ్గపై
ముద్దు తాలూకు తడి జ్ఞాపకంలా మిగలాలని....
ఎన్నెన్ని ఆశలు.......ఎన్నెన్నో ఆశలు....
ప్రేమ
నాలుగు కన్నుల ఎదురుచూపు ప్రేమ
ఎన్నో తెలియని భావాల బాధ ప్రేమ
ఛిలిపిదనాల తీయనైన అనుభవం ప్రేమ
మాట్లాడగలిగే మౌనం ప్రేమ
యుగాల నిరీక్షణే ప్రేమ
మనసైన వాడిని రెప్పల వెనుక దాచేది ప్రేమ
మరణాన్ని సైతం ఆహ్వానించేది ప్రేమ
ఆరాధించేది ప్రేమ
ఆరాటపడేది ప్రేమ
అంతు తెలియనిది ప్రేమ
అంతం లేనిది ప్రేమ
ఇది నాకు తెలిసిన ప్రేమ
నేను అక్షర భాష్యం చెప్పగలిగిన ప్రేమ
కాని...భాష తెలియని భావాలెన్నో
ప్రేమన్న రెండు అక్షరాల పదం లో
అతడు
చాలా చెప్పాలనుకున్నాను అతనికి
కాని ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి
ఎన్ని చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది
ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది
అతను ఎదుటపడితే తప్పుకుంటాను
ఒక క్షణం కనిపించకపోతే తపించిపోతాను
అతడు చూస్తూవుంటే తల వంచుకుంటాను
చూడకపోతే బాధపడుతుంటాను
నన్ను చూసి నవ్వుతుంటే తడబడిపోతాను
ఎవరూ లేని సమయం లో చాటుగా
అతన్ని చూస్తూ నిలబడిపొతాను
ఇలా వెంటపడుతున్నావేమిటని తిట్టాలనిపిస్తుంది కానీ....
మరుక్షణం అలా చేస్తూ వుంటేనే బాగుందనిపిస్తుంది
నాలో కలిగే ఈ భావ
భాష రాని బాధ
భావం భాష కి అందదు
వచ్చిన భాష భావాన్ని వివరించలేదు
ఇంక ఎలా నా బాధ తెలుపను చెలీ నీకు?
అందుకే నా కన్నులలోకి చూడవా
భావం కనిపిస్తుంది
నా యద పై చేయి వేయవా
మది లయలో బాధ వినిపిస్తుంది
మది కోరిన మరణం
ఇంకా ఎదురు చూస్తూనే వున్నాను నువు వస్తావని
నాకు తెలుసు నువు రావని ..రాలేవని
తిరిగి రాని సుదూర తీరాలకు తరలిపొయావని
అయినా నిరీక్షిస్తున్నాను ..నువు వస్తావని
నీదైన ప్రతి జ్ఞాపకం మది లో మెదులుతుండగా
మదురమైన భావాలను కలిగిస్తుంది
అసలు నువులేవన్న మాటనే మరిచిపోతున్నాను
మది కరిగించే నీ చిరునవ్వు కనులముందు కనిపిస్తూనే వుంది
నాపై వెన్నెల జల్లులు కురిపిస్తూనే వుంది
ఒంటరినై వున్నపుడు నీ వెచ్చని స్పర్శ
ఓదార్పుగా తీయని పలకరింపు తాలూకు భావన
ఇప్పటికీ నువ్వు వున్నావన్న అనుభూతిని కలిగిస్తున్నాయి
ఆ తలపులే ...నీవు నా వెంటే వున్నావన్న దైర్యాన్ని ఇస్తున్నాయి
అయినా.............నీవు లేని నా కల సైతం ఊహించలేను
నీ నీడగా మారిన నా మనసు తో పాటూనేనూ వస్తున్నాను
నిను చూడాలని...నీ దరి చేరాలని
ఈ లోకానికి చివరి వీడ్కోలు పలుకుతూ...
నీ దరి చేరబోతున్న నేను
ఆశ
చెలీ..
నీ ఒడిలో తల వాల్చి
మనసు విప్పి మాటాడి
నీ కౌగిలిలో సేదతీరాలని
నీవు నా తల నిమరగ
నీ కనులలోకి చూసి
ఆత్మీయత లోతు తెలుసుకోవాలని
పౌర్ణమి వెన్నెల్లో నీ గుండెల్లో తలవుంచి
పసిపాపలా నిదురించాలని
నేనల్లరి చేయగ, కోపించిన
నీ కన్నులలోని చిలిపిదనాన్ని
తనివితీరా చూడాలని
ఆశగా వుంది
తీర్చవూ ...ప్లీజ్
నీ ఒడిలో తల వాల్చి
మనసు విప్పి మాటాడి
నీ కౌగిలిలో సేదతీరాలని
నీవు నా తల నిమరగ
నీ కనులలోకి చూసి
ఆత్మీయత లోతు తెలుసుకోవాలని
పౌర్ణమి వెన్నెల్లో నీ గుండెల్లో తలవుంచి
పసిపాపలా నిదురించాలని
నేనల్లరి చేయగ, కోపించిన
నీ కన్నులలోని చిలిపిదనాన్ని
తనివితీరా చూడాలని
ఆశగా వుంది
తీర్చవూ ...ప్లీజ్
మౌనం
ఎన్ని ఊసులో ఈ మనసులో నీకు చెప్పేందుకు
ఇంతలోనే ఎంత మౌనమో నిను చూసినందుకు
ఎన్ని భాషలొచ్చినా గాని నా మనసుకు
మౌనమొకటే తెలుసు నా ప్రేమకు
నిను గూర్చి ఎన్ని తలపులో కనులు మూసినందుకు
వాటిని పదిలపరచుకున్నాను మనసుకి నచ్చినందుకు
.....................
నిను చూడగానే
నా కన్నులు పలికే భావం మౌనం
అధరాలు చిందించే లాస్యం మౌనం
నాయద సవ్వడి మౌనం
మనసు ఆశ్రయించే భాష మౌనం
ప్రేమలో మౌనం భాగమా?
లేక ప్రేమంటేనే మౌన రాగమా?......................
చినుకులు
అందమైన సాయంత్రాన
అల్లరి పిల్ల గాలులు చల్లగ వీస్తూ
మెల్లమెల్లగ మబ్బులను తాకి మురిపిస్తుంటే...
చిటపట పాటలతో కురుస్తున్న
చిరుజల్లులోని కొన్ని తుంటరి చినుకులు చిత్రం
గుండె లోతుల్లొ
భావాల బరువుతో చెమ్మగిల్లిన
కన్నుల్లో తడిని చెంపపై పడనీకు
ఆ జ్నాపకాలన్నీ కన్నీరుతో జారిపోగలవు
ఆ మధుర భావాలన్నీ
పెదవిపై ఛిరునవ్వు గా మార్ఛి
కలతలన్నీ తీర్ఛుకుని...
గతాన్ని నెమరువేస్తూ..అనుభూతులు ఆస్వాదిస్తూ
గుండెల్లో మరిన్ని జ్ఞాపకాలు పదిల పరుస్తూ
మరలా కొత్తగా లోకాన్ని చూడు
బాధ కలిగినప్పుడు
ఆ గుండెను తరచి చూడు
ఆనందం విరుస్తుంది...త్రుప్తి మిగులుతుంది
జీవితం
ఈ రంగుల లోకంలో
నావన్నీ నల్లని అనుభవాలు
కనుల కాగితం పై
కలల కావ్యాలకి బదులు కన్నీటి చిత్రాలు...
వదిలి పోయిన సున్నిత త్వం
కౌగిలించుకున్న కర్కశత్వం
నేను కాదనుకున్న కలివిడితనం
నన్ను కాదనుకున్న ఆనందం
నాలొని నన్ను చంపుకుంటూ
నన్ను నేను మార్చుకుంటూ....వెళ్ళాల్సిన
తీరం కనిపించని దూరం లో గమ్యం
కన్నవాళ్ళను వదిలి
స్నేహాలను మరచి
డాలర్ల లో వెతుక్కొవాల్సిన సంతోషం
నేనంటూ మిగిలి లేని
నాదంటూ ఏమిలేని
నాకంటూ ఎవరూ వుండకూడని జీవితం
పెళ్ళి కి అర్ధం ఇప్పుడు తెలిసింది
"నువ్వు కాని నువ్వు
నీది కాని జీవితం"
నీరేక్ష్ణ
చెలి మాటల వెల్లువల
అనురాగపు జల్లులు నన్ను అల్లాలని
అమె ఒడిలో సేద తీరాలని
చెలియ చలువ చెలిమి
చిరుఆశలు రేపగ
ఆశలు తీరే తరుణం కోసం
ఎన్ని యుగాలైనా నా నిరీక్షణం
ఓ బావన
ఒక అందమైన భావనకి వేవేల రూపాలు
అమ్మ-నాన్న
అన్న-చెల్లి
అతడు-ఆమె
నువ్వు-నేను...ఇలా ఎన్నో
అన్ని మనసుల మధ్యా ఉన్న
ఒకే వారధి ప్రేమ
అమ్రుతం తాగిందేమో ఈ ప్రేమ
నిత్యం యవ్వనం తో వుంటుంది
అందరిని తనలో నింపేసుకుంటూ
అందరినీ తనతో కలిపేసుకుంటూ...
మురిపిస్తూ[పసిపాపై]-మరిపిస్తూ[అమ్మై]
కవ్విస్తూ[ప్రేయసై]-లాలిస్తూ[నాన్నై]
బాధిస్తూ[అసూయై]-ఓదారుస్తూ[నేస్తమై]...ఇలా
ఎన్నో అనుభూతుల్ని అందిస్తూ.. మిగిలింది
చిరంజీవిగా ఈ ప్రేమ
కానలకు పంపిన కోదండరాముని ఫై,
జానకి కంత జాలి యేల?
జూదం లో తననోడిన ధర్మరాజు ఫై,
ద్రౌపది కంత దయయేల ?
తనను మరచి వెళ్ళిన దుష్యంతుని ఫై,
శకుంతల కంత సహనమేల?
తన దరికి తిరిగి రాని గోపాలుని ఫై,
రాధ కంత అనురాగమేల?
మాధవుని మనసైనదైనా,
హరిశ్చంద్రుని ధర్మపత్నియైనా ,
కాంతకు కన్నీరు తప్పలేదే?
తన సహనమే తనకు శిక్షా?
లోకహితం లోకపావనికి పరీక్షా?
లోకం లో మూడు వంతుల నీరు,
స్త్రీల నయనాలు చెమర్చిన కన్నీరు,
ఇంకా అతివను ఏడిపిస్తే మీరు ,
ధరణి దుఃఖ కడలి లోకి చేజారు. . !
friendship
చిరునవ్వుల సుమాలను దరికి చేర్చే దారం స్నేహం,
విషాదపు నీలినీడలను తరిమి వేసే కిరణం స్నేహం,
అడుగడుగునా అందాల నందనవనం ఈ స్నేహం,
మనసుపై మృదువైన మధువుల సంతకం నీ స్నేహం.
love
పూసే పువ్వుకు తుమ్మెద చుంబనమే ప్రేమ,
వేచే కలువకు చంద్రుని వెన్నెలే ప్రేమ,
నిదురించే శిశువుకు తల్లి లాలనే ప్రేమ,
కన్నె మదికి ప్రియుని కౌగిలే ప్రేమ,
బాధలు కలిగించు భవబంధం ఈ ప్రేమ,
అయినా
జీవితానికి అందం ఈ ప్రేమ .
Friday, August 20, 2010
Wednesday, August 18, 2010
Thursday, July 29, 2010
Monday, July 26, 2010
Saturday, July 3, 2010
Monday, May 17, 2010
Wednesday, April 28, 2010
Monday, April 26, 2010
Thursday, April 22, 2010
http://portal.unesco.org/ci/en/ev.php-URL_ID=2071&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html
Friday, April 16, 2010
Monday, February 22, 2010
లైబ్రరీ సాఫ్ట్ వేర్
http://www.unesco.org/isis/files/winisislicense.html
Thursday, January 28, 2010
Saturday, January 9, 2010
Subscribe to:
Posts (Atom)